Narudi Brathuku Natana | టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’(Peoples Media Factory) డిఫరెంట్ జానర్లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు ధమాకా, ఈగిల్, కార్తికేయ 2, రామబాణం, అంటూ బడా హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరో పక్క చిన్న చిత్రాలను, కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్టులను ఎంకరేజ్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల మందుకు వస్తుంది. ‘నరుడి బ్రతుకు నటన’ అంటూ ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ ఒక సినిమాను నిర్మిస్తుండగా.. ఈ చిత్రాన్ని రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రంలో శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వీవీఏ రాఘవ్, దయానంద్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ గ్లింప్స్ విడుదల చేశారు. నీకు నటన రాదు. అది అందరికి తెలుసు. నా జీవితం మొత్తంలో ఇంత చెత్త నటుడిని నేనేప్పుడు చూడలేదు అనే సంభాషణలతో గ్లింప్స్ మొదలవుతుంది. ఇక ఈ గ్లింప్స్ గమనిస్తే.. అవమానాలు ఎదుర్కొంటున్న ఒక యువకుడి గురించి చెబుతున్నట్లు కనిపిస్తుంది. కేరళ అందాలతో అద్భుతంగా సాగిన ఈ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా మలయాళం బ్లాక్ బస్టర్ కుంబలాంగి నైట్స్ రీమెక్ అని తెలుస్తుంది. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వవలసి ఉంది. ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధూ రెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.