అగ్ర హీరో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆయ్’. అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీవాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలు. నయన్ సారిక కథానాయిక. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఏ.సర్టిఫికెట్ లభించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘గోదావరి నేపథ్యంలో స్నేహం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాల కలబోతగా ఈ సినిమా సాగుతుంది.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. తెరపై గోదావరి అందాలను ఆవిష్కరిస్తూ ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని పంచే చిత్రమవుతుంది ఆగస్ట్ 15న ఈ చిత్ర పెయిడ్ ప్రీమియర్స్‌ను ప్రదర్శిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సమీర్కల్యాణి, సంగీతం: రామ్ మిర్యాల, సమర్పణ: అల్లు అరవింద్, దర్శకత్వం: అంజి కె మణిపుత్ర.