శర్వానంద్ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’. సంయుక్త మీనన్, సాక్షి వైద్య కథానాయికలు. రామ్ అబ్బరాజు దర్శకుడు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మాతలు. సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 5:49 ఫస్ట్ షోతో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని సోమవారం లాంచ్ చేశారు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి ఖరారైన శుభవేళ అనుకోకుండా హీరో జీవితంలోకి మాజీ ప్రియురాలు ఎంటరవ్వడం, కథ మలుపు తిరగడం.. ఇద్దరమ్మాయిల మధ్య చిక్కుకొని కథానాయకుడు ఉక్కిరిబిక్కిరి అవ్వడం.. ఇలా వినోదాత్మకంగా ట్రైలర్ సాగింది.
‘సామజవరగమనా’ చిత్రాన్ని పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించిన రామ్ అబ్బరాజు ఈ సినిమాను కూడా ఆద్యంతం వినోదాత్మకంగా మలిచాడని ట్రైలర్ చెబుతున్నది. శర్వానంద్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు హైలైట్ అనీ, సీనియర్ నటుడు నరేశ్ ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకుంటారని, సాంకేతికంగా సినిమా అభినందనీయంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సునీల్, సత్య, సుదర్శన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: నందు సవిరిగణ, కెమెరా: జ్ఞానశేఖర్ విఎస్, యువరాజ్, సంగీతం: విశాల్‌చంద్రశేఖర్.