Naresh- Pavitra Lokesh | ఆ మధ్య నరేష్-పవిత్ర లోకేష్ జంట మీడియాలో ఎంత హంగామా చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవిత్రతో నరేష్ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన జంటగా వెళుతున్నారు. ఎవరు ఏమి అనుకున్నా, తప్పుడు ప్రచారాలు చేసిన వారు లైట్ తీసుకున్నారు. నరేష్ మూడో భార్య పెద్ద హంగామా చేసిన కూడా నరేష్.. పవిత్రని వదిలి పెట్టలేదు. వారిద్దరు చక్కగా హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నరేష్ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు. తన ఎక్స్‌లో పవిత్రతో దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. ఎవరో తెలియని మహిళ మాకు గిఫ్ట్ ఇచ్చి షాక్ అయ్యేలా చేసిందని అన్నారు.
వెకేషన్‌కి వెళ్లేందుకు నరేష్, పవిత్ర హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లగా, అక్కడ వారిద్దరిని చూసిన మహిళ వారి దగ్గరకు వెళ్లి కొన్ని స్వీట్స్ ను బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని నరేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. ‘ఆమె ఎవరో తెలియదు కానీ, హైదరాబాద్ విమానాశ్రయంలో పవిత్రను, నన్ను చూసి.. ఆమెపై మీరు చూపించే శ్రద్ధ, ప్రేమ బాగుంది. ఆమెని అమ్ము అని పిలిచే విధానం నన్ను హత్తుకుంది. మీరు ఒక గొప్ప మనిషి. జీవితంలో ఆమెని పొందడం నిజంగా మీ అదృష్టం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పి స్వీట్ బాక్స్ ఇచ్చి అక్కడి నుండి వెళ్లిందట. అయితే ఆ సమయంలో ఆమె ముఖంలోని నిజాయితీ నచ్చింది. ఆమెని జీవితాంతం గుర్తుంచుకుంటాం. మా లైఫ్‌లో మెమోరబుల్ మూమెంట్.. చాలా థ్యాంక్స్ అని చెప్పుకొచ్చాడు నరేష్.
పవిత్ర-నరేష్ కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంత హంగామా చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందులో లిప్ లాక్ సీన్ అయితే సెన్సేష్ క్రియేట్ చేసింది. ఇక పవిత్ర ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. నరేష్ మాత్రం వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. సహాయ నటుడిగా పలు చిత్రాలతో బిజీగా ఉంటున్నాడు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పవిత్ర తన మొదటి క్రష్ అక్కినేని నాగార్జున అని చెప్పి షాక్ ఇచ్చింది . తనకు ఆరో తరగతి నుంచే నాగ్ అంటే ఇష్టమని తెలిపింది. తన జీవితంలో అలాంటి వ్యక్తి వుంటే బాగుంటుందని అనిపించేదని వెల్లడించింది. నాగార్జున తర్వాత ప్రకాష్ రాజ్‌ని చూశాక కూడా అలానే అనిపించిందని పవిత్ర చెప్పుకొచ్చింది.