నరేష్ అగస్త్య, సంజనా సారథి ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమకథ ‘మరొక్కసారి’. నితిన్ లింగుట్ల దర్శకుడు. బి.చంద్రకాంత్‌రెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
ఈ ప్రేమకథకు విజువల్స్ మరింత అందాన్ని తీసుకొచ్చాయని, కేరళ, సిక్కిం, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో షూట్ చేశామని, 5,430 మీటర్ల ఎత్తులో ఉండే గరుడోంగ్మార్ లేక్‌లో ‘మరొక్కసారి’ని చిత్రీకరించామని, ఇప్పటివరకూ ఈ ప్రాంతంలో ఏ ఇండియన్ సినిమా జరగలేదని మేకర్స్ తెలిపారు. బ్రహ్మాజీ, సుదర్శన్, దివ్యవాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రోహిత్ బచు, సంగీతం: భరత్ మాంచిరాజు.