Sundara Kanda | టాలీవుడ్ హీరో నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘సుందరకాండ’ (Sundara Kanda). వృతి వాఘని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 06న ప్రేక్షకుల విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా టీజర్ వేడుకను హైదరాబాద్లో నేడు నిర్వహించారు.
అయితే ఈ వేడుకలో పాల్గోన్న నారా రోహిత్ ప్రతినిధి 2 చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వేడుకలో రిపోర్టర్ అడుగుతూ.. ప్రతినిధి 2 హిట్టు అయ్యింది కాబట్టి ప్రతినిధి 3 వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అని అడుగుతాడు. దీనికి రోహిత్ సమాధానమిస్తూ.. ప్రతినిధి 2 ఎక్కడ హిట్టయిందండీ బాబు నాకు కూడా తెలిదు. నిజంగా ఆ సినిమా విడుదల అయ్యిందో కూడా నాకు తెలిదు. మీరు అన్నిసార్లు అడిగేసరికి వచ్చిందా అనుకున్నాను. ఒకవేళ నేను ప్రతినిధి 2 హిట్ అని చెప్పినా కూడా మీడియా హిట్ అవ్వలేదనే రాస్తుంది. దానికంటే నిజంను వాస్తవాన్ని ఒప్పుకోవడం బెటర్ అంటూ రోహిత్ చెప్పుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
“#Prathinidhi2 ఎక్కడ ఆడిందండి బాబు వచ్చినట్టు కూడా ఎవడికి తెలీదు” – #NaraRohit
Reality ni Accept cheyatam antha Easy kaadu. Nara Rohit garu really Great andi meeru 👌🏼👏❤️
pic.twitter.com/Jcxe092V2w— NEWS3PEOPLE (@news3people) August 26, 2024