Prathinidhi-2 Movie | నారా రోహిత్.. ఈ పేరు విని చాలా కాలమే అయింది. సోలో, ప్రతినిధి, రౌడీ ఫేల్లో, అసుర వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీసినా జనాల్లో ఆయన పేరు ఎక్కువగా రిజిస్టర్ కాలేదు. ఫిజిక్ పైన ఎక్కువగా దృష్టిపెట్టక, కెరీర్‌ను సరిగ్గా ప్లాన్ చేసుకోలేక తెరమరుగయ్యాడు. చివరగా ఆయన ఐదేళ్ల కిందట వచ్చిన వీర భోగ వసంత రాయలు సినిమాలో కనిపించాడు. ఆ తరువాత మళ్లీ కెమెరా ముందుకు రాలేదు. అయితే ఇన్నాళ్లకు మళ్లీ నారా రోహిత్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. తొమ్మిదేళ్ల కిందట ఆయన హీరోగా చేసిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్‌తో వస్తున్నాడు.
మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్‌లో ప్రతినిధి ఒకటి. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ.. బుల్లితెరపై మాత్రం సంచలనాలు సృష్టించింది. ఇప్పుడదే సినిమా సీక్వెల్‌తో వస్తున్నాడు. ఈ మేరకు ప్రీ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హ్యాండ్ మొత్తాన్ని న్యూస్ పేపర్లతో నింపి ఆసక్తకరంగా ప్రీ లుక్ పోస్టర్‌ను డిజైన్ చేశారు. చూస్తుంటే ఈ సారి కూడా పొలిటికల్‌గా స్ట్రాంగ్ ఇష్యూను టచ్ చేస్తూ సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది.
టీవీ-5 సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఏపిలో రానున్న ఎన్నికల దృష్ట్యా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఇన్సైడ్ టాక్. అంతేకాకుండా వీలైనంత త్వరగా షూటింగ్‌ను కంప్లీట్ చేసి ఎన్నికల ముందే సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్‌లో ఉన్నారట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిపోయాయని.. రేపో మాపో సెట్స్ పైకి కూడా వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సోమవారం రిలీజ్ చేయనున్నారు.
— Rohith Nara (@IamRohithNara) July 22, 2023