Napoleon | హాలీవుడ్ సినిమాలు చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు జోక్విన్ ఫీనిక్స్ (Joaquin Phoenix). గ్లాడియేటర్, జోకర్ (Joker), హర్ (her) వంటి చిత్రాలతో హాలీవుడ్లో తనకంటూ సేపరేట్ స్టార్డమ్ తెచ్చుకున్నాడు. అయితే జోకర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జోక్విన్ ఫీనిక్స్ నటించిన తాజా చిత్రం ‘నెపోలియన్’ (Napoleon). గ్లాడియేటర్, బ్లేడ్ రన్నర్, ది మార్షన్ లాంటి చిత్రాలు తీసిన ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు రిడ్లీ స్కాట్ (Ridley Scott) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. నవంబర్ 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్తో మంచి విజయం అందుకుంది. ఇదిలావుంటే.. ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చింది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమాను ప్రస్తుతం రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంచినట్లు ప్రైమ్ రాసుకోచ్చింది. దిగ్గజ ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. యాపిల్ స్టూడియోస్, స్కాట్ ఫ్రీ ప్రొడక్షన్స్, బీజీఐ సప్లైస్ లిమిటెడ్, లాటినా పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.
the quest for power and an insatiable desire to conquer it all! 💥
Napoleon available on #PrimeVideoStore, rent now pic.twitter.com/NHQ5s1dCzf
— prime video IN (@PrimeVideoIN) January 9, 2024