S.S RAjamouli | దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. SSMB29 అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అటు బాబు ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ సినిమా ఉండబోతుందని రాజమౌళి ఈ సినిమా గురించి ఇప్పటికే హింట్ ఇచ్చాడు. దీంతో మూవీ ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
ఇప్పటికే సినిమా షూటింగ్ లోకేషన్స్ కోసం రాజమౌళి కెన్యా అంతా తిరిగి వచ్చాడు. అయితే తాజాగా మూవీలో హీరోయిన్‌కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్లో హాలీవుడ్ హీరోయిన్ భారత సంతతికి చెందిన నవోమి స్కాట్(Naomi Scott)ను తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై నవోమితో రాజమౌళి చర్చలు కూడా జరిపాడని వార్తలు వస్తున్నాయి. కాగా దీనిపై జక్కన్న నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా ఇప్పటికే నవోమి స్కాట్‌ను ఇన్‌స్టాలో ఫాలో అవుతుండడంతో ఈ రూమర్స్ నిజం అయ్యేలా కనిపిస్తున్నాయి,
ఇక నవోమి స్కాట్ విషయానికి వస్తే.. ఇంగ్లాడులో పుట్టిన భారత సంతతికి చెందిన మహిళ. నవోమి అమ్మ ఉషా స్కాట్ గుజరాతీ నుంచి ఇంగ్లాండుకు వలస వెళ్లింది. సినిమాల విషయానికి వస్తే.. అల్లాద్దిన్, విజర్డ్స్, ఛార్లీస్ ఎంజెల్స్, స్మైల్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నవోమి.