Nani’s The Paradise | నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌పై గత కొద్దిరోజులుగా వస్తున్న రూమర్స్‌పై చిత్ర యూనిట్ ఘాటుగా సమాధానమిచ్చింది.
ఈ సినిమా రీషూట్ల వల్ల ఆలస్యం అవుతోందంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తుండగా.. ఈ వార్తలపై నిర్మాణ సంస్థ ఎస్ఎల్వీ సినిమాస్ (SLV Cinemas) స్పందిస్తూ.. ‘ది ప్యారడైజ్’పై జరుగుతున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించింది. ఇప్పటివరకు 100 రోజులకు పైగా షూటింగ్ ఎంతో పక్కా ప్రణాళికతో పూర్తయిందని, ఒక్క సీన్ కూడా రీషూట్ చేయలేదని మేకర్స్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, భవిష్యత్తులో కూడా రీషూట్లు చేసే ప్రసక్తే లేదని, సినిమా అవుట్‌పుట్ పట్ల తాము పూర్తి సంతృప్తితో ఉన్నామని వెల్లడించారు. ఇప్పటికే విడుదలైన ‘ఆయ షేర్’ సాంగ్ సృష్టించిన ప్రభంజనం సినిమాపై అంచనాలను భారీగా పెంచగా, షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ శరవేగంగా జరుగుతోందని వారు ధృవీకరించారు. సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో నాని ముక్కుపుడక, లాంగ్ హెయిర్‌తో పూర్తి భిన్నమైన గెటప్‌లో కనిపిస్తుండగా, మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా ముందే ప్రకటించిన విధంగా ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తామని మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో నాని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.