NANI | ఈ వారం బాక్సాఫీస్ దగ్గర రెండు బడా చిత్రాలు పోటీ పడ్డ విషయం తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలతో రజనీకాంత్, నాగార్జున నటించిన కూలీతో పాటు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో రూపొందిన వార్ 2 చిత్రాలు ఆగస్ట్ 14న థియేటర్స్‌లో విడుదల అయ్యాయి. భారీ అంచనాల మధ్య ‘వార్ 2’ మరియు ‘కూలీ’ చిత్రాలు ఒకే రోజు విడుదల కావడంతో, అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. ఈ సందడిలో కామన్ ఆడియన్స్‌తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా థియేటర్లలో సందడి చేశారు. న్యాచురల్ స్టార్ నాని ఈ రెండు సినిమాలను వీక్షించేందుకు హైదరాబాద్‌లోని ఏఎంబి థియేటర్‌కు వెళ్లారు.
అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. నాని పూర్తిగా మాస్క్‌తో ముఖాన్ని కప్పుకొని అక్కడికి వెళ్లాడు. తనని ఎవరు గుర్తు పట్టకూడదని ముఖాన్ని పూర్తిగా కవర్ చేసుకున్నాడు. తన కొత్త లుక్‌ను రివీల్ కాకుండా చూసేందుకు ఇలా మాస్క్ ధరించాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. ప్రస్తుతం నానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం నాని.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెంచింది.
ప్యారడైజ్ టీజర్, లుక్స్ చూస్తుంటే అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి అని చెప్పాలి. గతంలో పక్కింటి కుర్రాడిలే కనిపించే నాని ఇప్పుడు వయోలెంట్‌గా మారి ప్రేక్షకులని సంభ్రమాశ్చర్యాలకి గురి చేస్తున్నాడు. తాజాగా విడుదలైన మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. ప్యారడైజ్ లుక్స్, ఆ మేకింగ్ చూస్తుంటే నాని ఈ దెబ్బకు టైర్ 1 లిస్టులో చేరిపోయేలా కనిపిస్తున్నాడు. 200 కోట్లే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న నాని ఈ సినిమాతో ఏం చేస్తాడో చూడాలి. మూవీ మార్చ్ 26, 2026న విడుదల కానుంది.
Our @NameisNani papped today 📸😀
watched both #WAR2 & #Coolie at @amb_cinemas in hydVc – @ArtistryBuzz #Rajnikanth #JrNTR #HrithikRoshan#Nani #TheParadise pic.twitter.com/ovo6IwhXuk
— Nani Fans Association (@nfa_hyd) August 14, 2025