Yellamma Movie | బలగం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు వేణు ఎల్లమ్మ అనే ప్రాజెక్ట్‌తో రాబోతున్న విషయం తెలిసిందే. గత ఏడాదిగా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ను శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో మొదటగా నానిని అనుకున్న విషయం తెలిసిందే. నానితో అనౌన్స్మెంట్ కూడా మధ్యలోనే ఆగిపోయింది. అయితే నాని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి గల కారణాన్ని చెప్పాడు నిర్మాత దిల్ రాజు.
ఎల్లమ్మ ప్రాజెక్ట్‌ని మొదట నానితోనే అనుకున్నాం. కానీ నాని అప్పటికి శ్రీకాంత్ ఓదెలతో ప్యారడైజ్ సినిమా చేస్తున్నానని తెలిపాడు. ఈ ప్రాజెక్ట్ చాలా రోజులు పడుతుందని చెప్పడంతో నాని ప్లేస్‌లో నితిన్‌ని తీసుకున్నామంటూ దిల్ రాజు చెప్పుకోచ్చాడు.