కరోనా పరిస్థితుల వలన చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి.గత ఏడాది నాని నటించిన వి సినిమా ఓటీటీలో విడుదల కాగా, ఇప్పుడు ఆయన నటించిన టక్ జగదీష్ కూడా ఓటీటీ బాట పడుతుంది. ఇన్నాళ్లు కాస్త ఊగిసలాడినట్టు కనిపించగా, తాజాగా ప్రెస్ నోట్ ద్వారా అసలు విషయాన్ని చెప్పేశాడు నాని. టక్ జగదీష్ విడుదల మీద పూర్తి నిర్ణయాన్ని నిర్మాతలకే వదిలేస్తున్నాను అని ఓ ప్రెస్ నోట్‌ను అభిమానుల ముందుంచారు.
నాని తన ప్రెస్ నోట్లో థియేటర్స్‌లో సినిమాలు చూసేందుకు ఇష్టపడే పెద్ద అభిమానిని నేను. టక్ జగదీష్ అనే చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందగా, థియేటర్స్‌లో ఫ్యామిలీతో చూడాల్సిన చిత్రం ఇది. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితులు, వాటి వల్ల నిర్మాతలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి ఒత్తిళ్లకు, థియేటర్లో సినిమాలు చూడాలనే నాలోని అభిమాని మధ్య అలిసిపోయాను. ఇక్కడ, విదేశాల్లోనూ పరిస్థితులు దారుణంగానే ఉన్నాయి.
ఆంధ్రలో థియేటర్ల మీద అనేక ఆంక్షలున్నాయి. ఇందులో అనేక రకాల సమస్యలు కూడా ఉన్నాయి. నాకు నిర్మాతల పట్ల ఎప్పుడూ కూడా గౌరవభావం ఉంటుంది. సినిమాలను నిర్మించే వారు.. అన్ని నిర్ణయాలను తీసుకునే హక్కు ఉంటుంది. రెండో సారి నాకు మళ్లీ ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. టక్ జగదీష్ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా, షైన్ స్క్రీన్ నిర్మాతలు, స్టేక్ హోల్డర్లు అందరూ కలిసి ఎలా ఫిక్స్ అయినా కూడా వారి నిర్ణయాలను నేను గౌరవిస్తాను. వాటికి కట్టుబడి ఉంటాను. ఏ పద్ధతిలోనైన మీముందుకు వచ్చేందుకు వంద శాతం ప్రయత్నిస్తాను అని నాని ఎమోషనల్ లేఖ రాసారు. దీనిని బట్టి టక్ జగదీశ్ చిత్రం ఓటిటిలో రిలీజ్ కాబోతున్నట్లు క్లియర్ గా అర్థం అవుతోంది.
Love always.#TuckJagadish pic.twitter.com/aB4uhTz7iW
— Nani (@NameisNani) August 18, 2021