The Paradise Glimpse | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తోన్న ది ప్యారడైజ్ (THE PARADISE). Nani Odela 2 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు.
వైల్డ్ రైడ్ ఉండబోతుందంటూ ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం The Paradise Glimpseను విడుదల చేశారు. చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాసిర్రు కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలే. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానాకెళ్లి నడిచిన శవాల కథ. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ.. నా కొడుకు నాయకుడైన కథ….అంటూ డార్క్ షేడ్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
నాని రెండు జడలు, సిక్స్ ప్యాక్ బ్యాడీ, గన్స్‌తో నయా లుక్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడు. ఈ సారి కూడా కొత్త ప్రయోగంతో మరో సక్సెస్ అందుకునేందుకు రెడీ అవుతున్నట్టు గ్లింప్స్ చెప్పకనే చెబుతోంది. సినిమా సినిమాకు కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకొచ్చే నాని ఈ సారి కూడా ఎవరూ టచ్ చేయని కథాంశంతో రాబోతున్నాడని తాజా గ్లింప్స్ హింట్ ఇచ్చేస్తుంది.
ఇప్పటికే నాని టీం హింస, రక్తపాతం, తుపాకులు, గ్లోరీ, ఒక మనిషి.. అంటూ షేర్ చేసిన లుక్ నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. బ్లాక్ బస్టర్ దసరా కాంబో కావడం, నాని-అనిరుధ్ కాంబోలో జెర్సీ, గ్యాంగ్ లీడర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ది ప్యారడైజ్‌పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.
ది ప్యారడైజ్ గ్లింప్స్..
Posani Krishna Murali | పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్.. రాజంపేట జైలుకు తరలింపు
Mazaka Movie | 36 రోజుల్లో ‘మజాకా’ సినిమాని కంప్లీట్ చేశాం : సందీప్ కిషన్