నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో వచ్చిన ‘అంటే సుందరానికీ..’ సినిమా అనుకున్నంత ఆడలేదు. అయితే.. వివేక్ ఆత్రేయ టేకింగ్పై మాత్రం ప్రశంసలొచ్చాయి. వీరిద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా ‘సరిపోదా శనివారం’. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. ఇది పూర్తిగా ఒక ఫిక్షనల్ విలేజ్ నేపథ్యంలో సాగే సినిమా అని సమాచారం. ఇందులో నాని పాత్ర అత్యంత శక్తిమంతంగా దర్శకుడు డిజైన్ చేసినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ద్వితీయశ్రేణి హీరోల్లో నాని ముందున్నారు.
రీసెంట్గా ‘దసరా’ సినిమాతో వందకోట్ల మార్కును కూడా దాటేశారు. దసరా, హాయ్నాన్న సినిమాలతో వెంటవెంటనే హిట్లు అందుకున్నారు. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ కూడా హిట్ అయితే హ్యాట్రిక్ హీరోగా అవతరిస్తారు. అందుకే ఈ సినిమాకోసం నాని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా సినిమాకూ క్రేజ్ పెంచుకుంటూ దూసుకెళ్తున్న నాని రాబోవు సినిమాల విషయానికొస్తే.. సుజిత్ దర్శకత్వంలో ఆయన ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. ఆ సినిమా బడ్జెట్ వందకోట్ల పైమాటేనట. అలాగే తనకు ‘దసరా’ లాంటి బ్లాక్బాస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో కూడా నాని ఓ సినిమా చేయనున్నాడు. ఆ సినిమా బడ్జెట్ 150కోట్లు అని టాక్.