నాని నటించిన ‘దసరా’ చిత్రం తెలంగాణ నేపథ్య కథాంశంతో స్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద వందకోట్ల వసూళ్లతో నాని కెరీర్లో ఆ మైలురాయిని అందుకున్న తొలి సినిమాగా నిలిచింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.
ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ సినిమా ‘దసరా’కు మించి వందరెట్లు ఉండబోతున్నదని పేర్కొన్నాడు.
“దసరా’ మ్యాడ్సెన్ నా జీవితంలోకి తిరిగొచ్చింది. అద్భుతమైన మాస్ యాక్షన్‌కు సిద్ధంగా ఉండండి’ అంటూ నాని కూడా ట్వీట్ చేశారు. వీరిద్దరి సోషల్‌మీడియా స్టేట్మెంట్స్తో ఈ సినిమా మరోస్థాయిలో ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుందని సమాచారం.