Nani | న్యాచురల్ స్టార్ నాని ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన విషయం తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి, సెకండ్ హీరోగా, ఆపై లీడ్ హీరోగా మారిన నాని వరుస హిట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల ‘దసరా’, ‘హాయ్ నాన్న’ , అంటే సుందరానికి, హిట్ 3 వంటి చిత్రాలలో వైవిధ్యం చూపించి మంచి విజయాలను అందుకున్న నాని, త్వరలో ది పారడైజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఇదిలా ఉండగా, ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని తన వ్యక్తిగత జీవితం గురించి, ముఖ్యంగా తన కొడుకు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ “నా కొడుకు అర్జున్ ప్రస్తుతం సంగీతం, స్కేటింగ్ నేర్చుకుంటున్నాడు. ఇప్పటికే పియానో నేర్చుకున్నాడు. నా సినిమాల్లోని పాటలను పియానోపై ప్లే చేసి నాకు వినిపిస్తుంటాడు. ఈ వయసులో అంత త్వరగా పియానో నేర్చుకోవడం అంటే సంగీతంపై నిజమైన ఆసక్తి ఉండాలి అని అతని టీచర్లు కూడా చెబుతున్నారు” అని అన్నారు. అంతేకాదు, “భవిష్యత్తులో నా సినిమాకి మ్యూజిక్ ఇస్తాడేమో… చూడాలి” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు నాని.
ఇంతకుముందు అర్జున్ పియానో వాయిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా హెషమ్ రిథమ్ నైట్‌లో తన తనయుడు పియానో అద్భుతంగా వాయిస్తున్న తీరు చూసి ఫిదా అయ్యాడు నాని. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అర్జున్ భవిష్యత్తులో సినిమాల వైపు, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్షన్ వైపు అడుగులు వేయొచ్చని అభిమానులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్‌కి కూడా పియానో ప్లే చేయడంలో ఆసక్తి ఎక్కువ. ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ కాబోతున్నాడన్న వార్తలు ఇప్పటికే చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
Pure pride ❤️
Natural Star @NameisNani watching his son Arjun perform on the piano at Hesham’s Rhythm Night last night. 🎹🤩 pic.twitter.com/UixJXQ0yxy— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 27, 2025