Nani | సీనియర్ హీరో జగపతి బాబు ఇప్పుడు నటనతో పాటు టాక్ షోలతోనూ దుమ్ము రేపుతున్నారు. జీ5లో ప్రసారం అవుతున్న “జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి” అనే టాక్ షోలో జగ్గూభాయ్ తెగ అలరిస్తున్నారు. ఈ షోకు అతిథులుగా టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు హాజరవుతున్నారు. ఇప్పటికే నాగార్జున, శ్రీలీల ఎపిసోడ్లు ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇక తాజాగా నేచురల్ స్టార్ నాని ఈ షోలో పాల్గొన్నారు. ఈ షోలో నాని కాలర్ ఎగరేసే స్టైల్లో ఎంట్రీ ఇవ్వగా, జగ్గూభాయ్ పక్కా ఫన్‌తో ఎపిసోడ్‌ను నడిపించారు.
మనం ఫస్ట్ టైం ఎప్పుడు కలిశాం గుర్తుందా?” అని జగపతిబాబు అడిగితే… నాని మాత్రం “మీకు గుర్తుందా?” అంటూ సమాధానమిచ్చారు. దానికి జగ్గూభాయ్ “దెబ్బ తింది నేను కదా… నాకు గుర్తుంది, నీకు ఉండదు” అని నవ్వుతూ చెప్పారు. దీంతో నాని కూడా “దెబ్బా…” అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. అంతేకాక, ఈ షోలో ఓ ఆసక్తికర మలుపు తీసుకొచ్చారు జగ్గూభాయ్. “నాని క్రష్ ఎవరు? ఎంత మందికి ఐలవ్యూలు చెప్పావ్?” అనే ప్రశ్నతో నానిని సర్ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా నాని తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత విషయాలు, అభిరుచులు కూడా ఓపెన్‌గా పంచుకున్నారు.
ఈ ఎపిసోడ్‌ను ఆగస్టు 29వ తేదీ రాత్రి 9 గంటలకు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. అలాగే ఆగస్టు 31న అదే టైంలో జీ తెలుగు ఛానెల్లో ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇదిలా ఉంటే నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది 1960ల కాలపు గ్యాంగ్‌స్టర్ డ్రామా కాన్సెప్ట్‌తో రూపొందుతుంది. మాస్ వారియర్‌గా నానిని మనం ఇప్పటివరకు చూడని ఒక కొత్త షేడ్‌లో చూసే అవకాశం ఉంది. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా, 2026 మార్చి 26న థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం నాని నటుడిగానే కాదు నిర్మాతగాను సత్తా చాటుతున్నాడు.
Unmatchable vibe. All gossip and drama from the most Natural HIT machine, the one and only @NameisNani
Premieres Aug 29th @ 9 PM on ZEE5 Telugu
Also catch it on TV, Aug 31st @ 9 PM on Zee Telugu#JayammuNischayammuRaaWithJagapathi #ZEE5Telugu #ZEE5 #Nani pic.twitter.com/FmdbH7uAXB— ZEE5 Telugu (@ZEE5Telugu) August 25, 2025