Saripodhaa Sanivaaram | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తోన్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 29న విడుదల చేస్తున్నారు. కాగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఇవాళ సాయత్రం 5 గంటల నుంచి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.
కాగా ట్రైలర్ టైంను గుర్తు చేస్తూ నాని హంగామా షురూ అంటూ డీవీవీ ఎంటర్టైన్మెంట్ ఎక్స్‌లో నయా లుక్ ఒకటి షేర్ చేసింది. ఈ లుక్ చూసిన అభిమానులు ట్రైలర్ ఎప్పుడెప్పుడొస్తుందా..? అని తెగ ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఆఫీసులో నాని.. డ్యూటీ (కానిస్టేబుల్)లో ప్రియాంకా మోహన్ చాట్‌లో ఉన్న స్టిల్స్ షేర్ చేశారని తెలిసిందే.
సూర్య : హాయ్ స్కూటీ పెప్ అని మెసేజ్ పెడితే.. చారు : హాయ్ బాటిల్ క్యాప్ అని రిప్లై ఇచ్చింది. సూర్య 4:05 ? అని పెట్టగా.. చారు 4:05 ఒకే అంటూ రిప్లై ఇచ్చింది. ఈ ఇద్దరూ సాయంత్రం కలిసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని చాట్‌తో అర్థమవుతోంది. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఎస్జే సూర్య (SJ Suryah) కీలక పాత్ర పోషిస్తున్నాడు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వస్తోన్న ఈ మూవీ ఇతర భాషల్లో Suryas Saturday టైటిల్‌తో రిలీజ్ కానుంది.
Hungama Shuru 🔥#SaripodhaaSanivaaram pic.twitter.com/6Kaq22Ls20
— DVV Entertainment (@DVVMovies) August 13, 2024
Ravi Teja | సుమ, భాగ్య వీళ్లే ఫొటో తీయండి.. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్‌లో రవితేజ