Saripodhaa Sanivaaram | వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తోన్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). నాని 31గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి మీ విజ్ఞప్తులు వినబడ్డాయి.. సరిపోదా శనివారం మ్యూజికల్ హీట్ వేవ్ షురూ.. అంటూ ఇప్పటికే మేకర్స్ ఓ వార్తను పంచుకున్నారని తెలిసిందే.
పేజీలు తిప్పుతూ సూర్య మ్యాడ్నెస్ కౌంట్ డౌన్ షురూ.. అంటూ ఓ వీడియోను షేర్ చేశారు మేకర్స్. ఫస్ట్ సింగిల్ Garam Garam గరం గరం సాంగ్‌ను రెండు రోజుల్లో మీ ముందుకు తీసుకొస్తున్నట్టు తెలియజేశారు. జూన్ 15న పాటను లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన అంటే సుందరానికి మిక్స్డ్ టాక తెచ్చుకుంది. ఈ ప్రాజెక్టు తర్వాత నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో మరోసారి వస్తున్న సినిమా కావడంతో మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. నాని అండ్ టీంపై ఇటీవలే హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో హై ఆక్టేన్ క్లైమాక్స్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నట్టు అప్డేట్ వచ్చిందని తెలిసిందే. ఈ మూవీలో ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఎస్జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటిస్తున్నాడు. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. గ్యాంగ్‌లీడర్ తర్వాత నాని, ప్రియాంకా మోహన్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది.
Turning the pages and counting down to Surya’s Madness 🔥
Gear up for the #GaramGaram song in 2 Days 💥#SSFirstSingle on June 15th 🎧#SaripodhaaSanivaaram#SuryasSaturday pic.twitter.com/S2WeM34DfH
— DVV Entertainment (@DVVMovies) June 13, 2024