Nani | న్యాచురల్ స్టార్ నాని (Nani) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా సినిమా చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని 31గా వస్తోంది. ఇప్పటికే సరిపోదా శనివారం మ్యూజికల్ హీట్ వేవ్ షురూ.. అంటూ మేకర్స్ నాని టీంలో జోష్ నింపుతున్నారు మేకర్స్. పేజీలు తిప్పుతూ సూర్య మ్యాడ్నెస్ కౌంట్ డౌన్ షురూ.. అంటూ లాంఛ్ చేసిన ఫస్ట్ సింగిల్ Garam Garam గరం గరం ప్రోమో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ జూన్ 15న ఉదయం 11:07 గంటలకు గ్రాండ్‌గా లాంఛ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. రేపు సానపాటి భరద్వాజ్ పాత్రుడు, జేక్స్ బిజోయ్, విశాల్ దడ్లాని డైనమిక్ ట్రియో రేపు మీ స్పీకర్లను బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నారని తెలియజేస్తూ కొత్త పోస్టర్ ఒకటి షేర్ చేసింది డీవీవీ ఎంటర్టైన్మెంట్.
ఈ చిత్రంలో గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తు్న్నారు. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు ఎస్జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటిస్తున్నాడు. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
గ్యాంగ్‌లీడర్ తర్వాత నాని, ప్రియాంకా మోహన్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. అంటే సుందరానికి తర్వాత నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది.
The TRIO is ready to SHATTER YOUR SPEAKERS on loop tomorrow 🥁🥁#GaramGaram Yamudayo….🔥🔥@JxBe ~ @VishalDadlani ~ @Patrudusb ❤️#SaripodhaaSanivaaram#SuryasSaturday pic.twitter.com/RMBd6hWJcC
— DVV Entertainment (@DVVMovies) June 14, 2024
Here we go… #GaramGaram Promo 🔥
A goosebumps loaded bonanza awaits on June 15th at 11:07 AM 💥#SaripodhaaSanivaaram#SuryasSaturday pic.twitter.com/NWNkqFZET5
— DVV Entertainment (@DVVMovies) June 13, 2024