Nani – Nithin | నేచురల్ నాని ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ ది టౌన్‌గా మారాడు. ఆయన ఏది ముట్టుకున్నా బంగారమే అవుతుంది. హీరోగా, నిర్మాతగా వంద శాతం స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల వచ్చిన తమ్ముడు చిత్రం కథ ముందుగా నాని దగ్గరకు రాగా, దానిని రిజెక్ట్ చేయడంతో నితిన్ వద్దకు వెళ్లింది. నితిన్ ప్రధాన పాత్రలో రూపొందిన తమ్ముడు డిజాస్టర్ తెచ్చుకోవడంతో నాని సేఫ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.‘MCA’తో మొదటి విజయం అందుకున్న వేణు శ్రీరామ్, ‘వకీల్ సాబ్’తో స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిపోయారు. అయితే ఆ తర్వాత ఆయన తయారుచేసిన స్క్రిప్ట్ ‘తమ్ముడు’ను తొలుత నానికి వినిపించారు. కానీ నాని దాన్న తిరస్కరించారు. కథలో ఏదో తేడా ఉందన్న అభిప్రాయంతో నాని ఈ ప్రాజెక్ట్‌కి నో చెప్పినట్టు సమాచారం.
నాని రిజెక్ట్ చేసిన కథకి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈ మూవీ దిల్ రాజు నిర్మాణంలో సెట్స్‌పైకి వెళ్లింది. కానీ తమ్ముడు చిత్రం విడుదల తర్వాత నెగెటివ్ టాక్, సోషల్ మీడియా ట్రోలింగ్, బాక్సాఫీస్ పరాజయం అన్నీ ఒకేసారి ఎదురయ్యాయి. దీంతో నితిన్ కథల ఎంపికపై కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. “నాని నో చెప్పిన కథతో నితిన్ ఎందుకు రిస్క్ తీసుకున్నారు?” అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ఇక్కడే మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. నితిన్ చేయబోయే తదుపరి చిత్రం ‘ఎల్లమ్మ’, ఇది కూడా నాని తిరస్కరించిన కథే. ఇప్పుడు ఈ సినిమాకు బలగం వేణు దర్శకత్వం వహిస్తుండగా, నిర్మాత దిల్ రాజు.దీంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో చర్చ మొదలైంది.
తమ్ముడు సినిమా టాక్‌తో నాని కథల ఎంపికలో చూపిన తెలివి అద్భుతం అంటూ ప్రశంసిస్తున్నారు. నితిన్, దిల్ రాజు కథల ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు దిల్ రాజు సినిమా నిర్మిస్తున్నారు అంటే అది 100 శాతం హిట్ అనే నమ్మకం చిత్ర పరిశ్రమలో, అభిమానుల్లో ఉండేది. కానీ ఇటీవల దిల్ రాజు కథల జడ్జిమెంట్ విషయంలో ట్రాక్ తప్పుతున్నారు. ఫ్యామిలీ స్టార్, థాంక్యూ, గేమ్ ఛేంజర్, తాజాగా తమ్ముడు చిత్రాలు ఊహించని డిజాస్టర్స్ అయ్యాయి. ఇటీవల ఆయనకి ఊరటనిచ్చిన అంశం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మాత్రమే. తమ్ముడు చిత్రం ఘోర పరాజయం దిశగా పయనిస్తుండడంతో దర్శకుడు వేణు శ్రీరామ్ గురించి కూడా చర్చ మొదలైంది. కొందరు హీరోలు ఆయనతో సినిమా చేసేందుకు అంత ఆసక్తి చూపడం లేదనే టాక్ కూడా వినిపిస్తుంది.