Nani | దసరా విజయంతో నేషనల్ లెవెల్‌కి ఎదిగిన నేచురల్ స్టార్ నాని, ఇప్పుడు మరోసారి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో జట్టుకట్టాడు. ఈ కాంబినేషన్లో రూపొందుతున్న కొత్త యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను నాని కెరీర్లోనే అతిపెద్ద బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. 1980–90 సమయంలో హైదరాబాదు గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా, ఈ ప్రాజెక్ట్‌ను 2026 మార్చి 26న గ్లోబల్‌గా విడుదల చేయనున్నారు.
ఇటీవల లీక్ అయిన నాని లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పొడవాటి జుట్టు, గడ్డంతో నాని మాస్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తున్న ఈ లుక్‌కి అభిమానులు ఫిదా అయ్యారు. “ఇది నాని కెరీర్లో బెస్ట్ లుక్” అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. గతంలో ‘దసరా’లో వచ్చిన రఫ్ అండ్ టఫ్ లుక్‌ను మించి ఉండేలా ఈ గెటప్ ఉండడం సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. నాని ఈ సినిమాకోసం ఫిజికల్‌గా చాలా మారిపోయారు. లీన్‌గా, మసిల్డ్ బాడీతో అద్భుతంగా ట్రాన్స్ఫామ్ అయిన నాని, ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌తో స్క్రీన్‌ను షేక్ చేయబోతున్నారని ఇండస్ట్రీలో టాక్.సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆల్బమ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మోహన్ బాబు, కయాదు లోహార్, రాఘవ జూయల్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ‘రా స్టేట్మెంట్’ వీడియోకు విశేష స్పందన వచ్చింది. ప్యారడైజ్‌కి సంబంధించిన ప్రతి అప్డేట్కు ప్రేక్షకులు ఉత్సాహంగా స్పందిస్తున్నారు. ఈ క్రేజ్ చూస్తుంటే, ‘ది ప్యారడైజ్’ 2026లోనే కాదు, నాని కెరీర్లో కూడా ఓ మైలురాయిగా నిలవనుందని నిశ్చయంగా చెప్పవచ్చు. మూవీ కోసం ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.