న్యాచురల్ స్టార్ హీరో నాని (Nani), నజ్రియా నజీమ్ (Nazriya) కాంబినేషన్లో వస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki). వివేక్ ఆత్రేయ (Vivek Athreya) డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం జూన్ 10న (శుక్రవారం0 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉంది నాని టీం. తాజాగా నజ్రియా సోషల్ మీడియాలో ఈ సినిమాలోని ఓ ట్రాక్‌కు డ్యాన్స్ చేసిన వీడియో పోస్ట్ చేసింది.
నాని, అంజు యెలవర్తితో రీలింగ్ అండ్ ఫీలింగ్..బాయ్స్ ఇపుడిక మీ వంతు అని క్యాప్షన్ ఇచ్చింది నజ్రియా. బ్యాక్ డ్రాప్లో స్క్రీన్‌పై సాంగ్ విజువల్స్ ప్లే అవుతుండగా..అదే పాటకు నాని, నజ్రియా, అంజు కలిసి చేసిన డ్యాన్స్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో రోహిణి, నరేశ్, విష్ణువర్దన్ కీలక పాత్రల్లో నటించారు. నేడు హైటెక్‌సిటీ శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు మేకర్స్.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరుకాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ అండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. నాని అండ్ నజ్రియా టీం పక్కా ఎంటర్టైన్ మెంట్ అందించడం ఖాయమని తెలుస్తోంది.