నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘దసరా’. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాన్ ఇండి యా మూవీగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సింగరేణి ప్రాం తమైన గోదావరిఖని దగ్గరలోని ఓ గ్రామ నేపథ్యంతో ఈ చిత్ర కథ సాగనుంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్ యాక్షన్ పాత్రలో నాని కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సం గీతాన్ని అందించిన ఈ చిత్రం నుం చి తొలి లిరికల్ పాట ‘ధూమ్ ధామ్ దోస్తాన్..’ను దసరా పండుగ సందర్భంగా ఈ నెల 5న విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ పాటలోని నాని స్టిల్ రివీల్ చేశారు. ఈ స్టిల్లో ఇప్పటివరకు కనిపించనంత మాస్ లుక్లో నాని కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది.