పెరిగిన ఇమేజ్ దృష్ట్యా పాన్ ఇండియా సినిమాలనే ప్లాన్ చేస్తున్నారు హీరో నాని. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి ‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల సినిమా కాగా, రెండోది శైలేష్ కొలను ఫ్రాంచైజీ ‘హిట్ 3’. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు త్వరలో సెట్స్‌కి వెళ్లనున్నాయి. పాన్ ఇండియా రిలీజ్‌ని దృష్టిలో పెట్టుకొని టైటిల్స్ విషయంలో మేకర్స్ ఆచితూచి వ్యవహరిస్తున్న రోజులివి. ‘హిట్ 3’ టైటిల్ ఎలాగూ పాన్ఇండియాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. మరి శ్రీకాంత్ ఓదెల సినిమా టైటిల్ కూడా అలాగే యూనివర్సల్‌గా ఉంటే బాగుంటుదని నాని ఫీలవుతున్నారట. అందుకే.. ఈ సినిమాకు ‘ప్యారడైజ్’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. ‘ప్యారడైజ్’ అంటే స్వర్గం. ప్యారడైజ్ అనే ఫిక్షనల్ ఏరియాలో ఈ కథ జరుగతుందట. అందుకే ఈ కథకు ఈ టైటిల్ యాప్ట్‌గా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ టైటిలే ఖరారయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.