Nani| నేచురల్ స్టార్ నాని ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు. తన టాలెంట్‌తోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు నిర్మాతగాను సత్తా చాటుతున్నాడు. అయితే నానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తన ఫిజిక్‌ని కాపాడుకునేందుకు నాని ఎంత కష్టపడతాడు అనే విషయం ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. తాజాగా హీరో నాని డైట్ గురించి ఫిట్నెస్ క్రియేటర్ అండ్ కోచ్ అయిన విశ్వ భరత్ కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… నాని ప్రతి రోజు కూడా 12.30 గంటలకి నిద్రలేచి ఒంటి గంటకి వర్కౌట్లు మొదలుపెడతారు. అనంతరం 300-400ml ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటారు.
ఆ జ్యూస్‌లో కొద్దిగా ఉప్పు కలుపుకుంటారు. ఆ తర్వాత పలు సప్లిమెంటరీలు తీసుకుంటారు. నాలుగు గంటల సమయంలో సాధారణ తెలుగు భోజనం చేస్తారు. ఇందులో 60 గ్రాముల రా రైస్, టమాటా లేదా తోటకూరతో కలిపి వండిన 50 గ్రాముల పప్పు, చిక్కుడుకాయ, బీరకాయ, బెండకాయ ఇలా కూరగాయలతో వండిన ఓ కూర, 150 గ్రాముల చికెన్, ఇంకా ఎగ్స్ వంటివి ఉంటాయని తెలిపారు. ఇలా భోజనం తీసుకోవడం వలన 800-900 గ్రాముల క్యాలరీస్, 60-70 గ్రాముల ప్రొటీన్ వస్తుంది. ఇక రాత్రి 9 గంటల సమయంలో ఓ ఫ్రూట్ బౌల్ లేదా 200 గ్రాముల చికెన్, ఫిష్ తీసుకుంటారు. రోజంతా హైడ్రేట్‌గా ఉండేందుకు సుమారు 4లీటర్ల నీళ్లు తాగుతారు అని చెప్పుకొచ్చారు విశ్వ భరత్.
అయితే విశ్వ చెప్పిన మాటలని బట్టి చూస్తుంటే నాని ఎక్కువగా రాత్రి షూటింగ్స్‌లో పాల్గొంటారని, ఉదయం అంతా పడుకొని మధ్యాహ్నాం నిద్ర లేచి వర్కవుట్స్ చేస్తారని అర్ధమవుతుంది. నాని తీసుకునే డైట్ బాగుంది కానీ వేళాపాళా లేకుండా నిద్రలేవడం, తినడం మాత్రం అంత పర్ఫెక్ట్ అనిపించడం లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే నాని సమర్పణలో రూపొందిన కోర్ట్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక నాని ప్రధాన పాత్రలో ది ప్యారడైజ్ చిత్రం రూపొందుతుండగా, ఇది నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా మారుతుందని కొందరు భావిస్తున్నారు. మరోవైపు హిట్ 3 కూడా చేస్తున్నాడు నాని.