Nani | ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు నాని. కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన నాని ఇప్పుడు నిర్మాతగా కూడా సత్తా చాటుతున్నాడు. డైరెక్టర్ అవుదామని వచ్చి యాక్టర్‌గా స్థిరపడ్డ నాని మొదట్లో దిగ్గజ దర్శకుడు బాపు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత అల్లరి బుల్లోడు, అస్త్రం వంటి సినిమాలకు కూడా అసిస్టెంట్‌గా పనిచేశాడు. అయితే తన స్నేహితురాలు, దర్శకురాలు నందిని రెడ్డి సాయంతో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అష్టాచమ్మా సినిమాలో ఛాన్స్ అందుకున్న నాని కెరీర్లో తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు.
అలా ఒక్కో సినిమాతో మంచి హిట్స్ అందుకుంటూ స్టార్ హీరో రేంజ్‌కి వెళ్లాడు. అయితే నాని రీసెంట్గా ఓ షోకి హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో కావడానికి, చిత్ర పరిశ్రమలో నేను ఎదుర్కొన్న కష్టాలు మరెవరు పడకూడదని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారాడు. జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న జయమ్మ నిశ్చయమ్మురా టాక్ షోకు గెస్ట్‌గా వచ్చిన నాని మాట్లాడుతూ.. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా చాలామంది ఇండస్ట్రీ జనాలు, ఫ్యాన్స్ కానీ మా వాడిది ఆడాలి, ఇతరులది ఆడకూడదు అని అనుకుంటారు. ఎవ్వరికీ అర్ధం కానీ విషయం ఏంటంటే సినిమాలు అన్ని ఆడుతుంటే నీది ఆడుతుంది. ఏది ఆడకపోతే నీది కూడా ఆడదు.. అన్ని సినిమాలు ఆడాలని కోరుకోవాలి.అందరూ బాగుంటూనే మనం కూడా బాగుంటాం.. మనమే బాగుండాలని కోరుకున్నామంటే, మనం బాగుండం, ఎవరికీ కూడా మంచి జరగదు అని నాని అన్నారు.
ఇక ఒకప్పుడు తన ఫ్యామిలీ ఇబ్బందుల గురించి మాట్లాడిన నాని.. నాన్న గోదావరి ఫెర్టిలైజర్స్ లో జాబ్ చేసారు. అయితే అనుకోని పరిస్థితులలో ఆ జాబ్ మానేసి చిన్న చిన్న బిజినెస్ లు పెట్టారు, అవి కలిసి రాలేదు. అయితే అప్పుడు మా అమ్మ సెంట్రల్ గవర్నమెంట్ CGHS లో ఫార్మసిస్ట్ గా పని చేసేది.అయితే అమ్మ జాబ్ చేయడం వలన నాన్నకి బిజినెస్‌లో లాస్ వచ్చిన ఇంట్లో గడిచిపోయేది. నాన్న కూడా ఒకానొక టైంలో అమ్మ మీద ఆధారపడ్డారు. నాన్న, అక్క, నేను అందరం కూడా అమ్మ మీద ఆధారపడాల్సి వచ్చింది. నాన్న అందర్నీ బాగా నమ్మేసి మోసపోయారు. అమ్మతో కూడా కొన్ని సంతకాలు పెట్టించి ఇబ్బందులు పడ్డారు. నాన్న అందరికి హెల్ప్ చేయాలనే ఆలోచన వల్లే మాకు మంచి జరిగిందేమో అనుకుంటాను అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు