Nani | ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన టాలెంట్‌తో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నాని. అతనిని చూస్తే మన పక్కింటి కుర్రాడు అనే ఫీలింగ్ అందరికి కలుగుతుంది. న్యాచురల్ యాక్టింగ్‌తో న్యాచురల్ స్టార్ అనే బిరుదుని కూడా అంది పుచ్చుకున్నారు నాని. అయితే నానికి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి టీనేజర్స్ వరకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటనని, సినిమాలని ప్రతి ఒక్కరు పిచ్చిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. నాని సినిమా ఏదైనా సరే టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే చూడటానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు
ఈగ నుండి మొదలుకొని సరిపోదా శనివారం వరకు నాని విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులని అలరించాడు. అయితే నాని ఇప్పటి వరకు చేసిన ప్రతి చిత్రంలో కూడా ఎంతో కొంత ఫ్యామిలీ టచ్ ఉంటుంది. ఇప్పుడు వాటికి భిన్నంగా నాని ట్రై చేస్తున్నాడు. నాని ఇప్పుడు చేస్తున్న హిట్ 3, ది ప్యారడైజ్ చిత్రాలు చూస్తుంటే నాని ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు కొంత యూత్ ఆడియన్స్‌ని కూడా దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిట్-3 ట్రైలర్ రిలీజ్ అయ్యాక నానినే నా పిల్లాడిని ఈ మూవీకి తీసుకెళ్లనని చెప్పాడు. ఇన్‌డైరెక్ట్‌గా క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు రావొద్దని చెప్పుకొచ్చాడు.
ఇక ప్యారడైజ్ లో కూడా వయొలెన్స్ ఎక్కువ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్యారడైజ్ నుంచి రిలీజయిన గ్లింప్స్ లో ఓ బూతు పదాన్ని హైలెట్ చేయడం చర్చగా మారింది.అయితే నానినే ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్‌కి రావొద్దని డైరెక్ట్‌గా చెప్పడంతో ఎందుకు వారిని దూరం చేసుకుంటున్నాడు అని ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. నాని వంద కోట్ల హీరోగా మారాడంటే దాని వెనక ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తప్పక ఉంటుంది. మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నాని ఇంత వయొలెన్స్ తో సినిమాలు తీయడం అవసరమా అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇక నాని హిట్ 3 సినిమా మే 1న రిలీజ్ కానుండగా, ఈ సినిమా టాక్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారా అన్నది చూడాలి