టాలీవుడ్లో తెలుగు సినిమాల షూటింగ్స్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నా సినిమాల్లో నాని (nani) నటిస్తోన్న దసరా (Dasara) కూడా ఒకటి. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్నాడు. తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ సినిమాపై భారీగా హోప్స్ పెట్టుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన సగభాగం షూటింగ్ పూర్తయినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
కాగా ఈ సినిమా షూటింగ్ కోసం నాని డేరింగ్ స్టెప్ వేయబోతున్నాడని ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. సినీ పరిశ్రమలో బంద్ కొనసాగుతున్నప్పటికీ మేకర్స్ దసరా సినిమా షూటింగ్ కొనసాగించాలని అనుకుంటున్నారట. ఇప్పటికే నిర్మాతలు పెద్దమొత్తంలో ఈ సినిమాపై డబ్బులు పెట్టిన నేపథ్యంలో..ఏ మాత్రం వారిని రిస్క్‌లో పడేయొద్దని ఈ డెసిషన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ప్రొడ్యూసర్స్ గిల్డ్ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్, సత్యన్ సూర్యన్ మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని తొలిసారి పక్కా తెలంగాణ పాత్రలో మాస్ లుక్‌లో కనిపించబోతున్నాడు. స్టార్ హీరోయిన్ కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.