 
                                                            Nani@15 Years | ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చే వాళ్లకు ఇన్స్పిరేషన్ ఎవరంటే దశాబ్దం కిందటి వరకు చిరంజీవి, రవితేజల పేర్లు చెప్పేవారు. బ్యాక్ గ్రౌండ్ లేనివాళ్లకు వీరద్దరూ ఒక హోప్‌ను ఇచ్చారు. అలా ఇప్పటితరానికి హోప్ అంటే నాని పేరు చెప్పుకుంటుంటారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా క్లాపింగ్ కొట్టే స్థాయి నుంచి.. అందరూ తన నటనను చూసి క్లాప్స్ కొట్టే స్థాయికి ఎదిగాడు. అందరితేచ నేచురల్ స్టార్ అని స్టాంప్ వేయించుకున్నాడు. నాని నటన చూసి మహామహులు సైతం ఔరా అన్నారంటే నటనలో ఆయన స్థానం ఏంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నానిని చూస్తే పక్కింటి అబ్బాయిని చూసిన ఫీలింగ్ కలుగుతుందని ఎందరో ఫ్యామిలీ ఆడియెన్స్ అన్న మాటలు.

ఫలితాలేలా ఉన్నా.. ఫ్యామిలీ ఆడియెన్స్ మట్టుకు నాని సినిమా వచ్చిందంటే చాలు థియేటర్లలో వాలిపోతుంటారు. కాగా నేటితో నాని ఇండస్ట్రీలోకి వచ్చి 15 వసంతాలు పూర్తి పూర్తయ్యాయి. సరిగ్గా ఇదే రోజున అష్టా చమ్మా రిలీజై బంపర్ హిట్ విజయం సాధించింది. కాగా ఈ పదిహేనేళ్ల నాని జర్నీ గురించి ఓ సారి తెలుసుకుందాం. మణిరత్నం సినిమాలు చూసి దర్శకుడు అవ్వాలని సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు నాని. ఎన్నో నెలల స్ట్రగుల్ తర్వాత బాపు గారి ‘రాధాగోపాలం’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత ‘అల్లరి బుల్లోడు’, ‘అస్త్రం’, ‘ఢీ’ వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా నాని పని చేశాడు.

ఆ తర్వాత డైరెక్టర్ నందిని రెడ్డి సలహా మేరకు ఆర్జేగా వర్క్ చేశాడు. అదే టైమ్‌లో ఓ కథను రాసుకుని బన్నీకు చెప్పి ఓకే కూడా చేయించుకున్నాడు. కానీ ఎందుకో అది వర్కవుట్ అవ్వలేదు. ఇక అప్పుడే నందిని రెడ్డి ‘జర మస్తీ జర ధూమ్’ అనే టాక్ షో చేస్తుంది. కాగా ఆ టాక్ షో కోసం ఓ ప్రోమో చేయాల్సి ఉండగా.. నానిని పెట్టి ప్రోమో చేసింది. అది చూసిన ఇంద్రగంటి తను  చేయబోయే ‘అష్టా చమ్మా’ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చాడు. అయితే ముందుగా ఈ సినిమాలో నానికి సెకండ్ హీరో చాన్స్ ఇచ్చిన ఇంద్రగంటి.. నాని నటన చూసి మేయిన్ హీరోగా పెట్టేశాడు.

ఈ సినిమాతో నాని హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి అడుగులోనే ఊహించని సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత వెంటనే తనీష్‌తో కలిసి ‘రైడ్’ సినిమా చేశాడు. ఈ సినిమా కూడా పర్వాలేదనిపించే హిట్టు సాధించింది. అదే టైమ్‌లో ‘స్నేహితుడా’ అనే రోమ్ కామ్ సినిమా చేశాడు. కానీ ఇది నాని స్పీడ్‌కు బ్రేకులు వేసింది. ఆ తర్వాత రూరల్ బ్యాక్గ్రాప్లో వచ్చిన ‘భీమిలీ కబడ్డి జట్టు’ నానిని ఓ మంచి పర్ఫార్మర్ను చేసింది. అప్పుడే నాని లాంగ్ టైమ్ ఫ్రెండ్ నందిని రెడ్డి, నానిని హీరోగా పెట్టి ‘అలా మొదలైంది’ సినిమా తీసింది. ఈ సినిమా సాధించిన విజయం అంతా ఇంతా కాదు. ఏకంగా వంద రోజులు ఆడి డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది. అంతేకాకుండా నానికు ఈ సినిమాతో యూత్‌లో తిరుగులేని పాపులారిటీ వచ్చింది.

ఇక ఆ తర్వాత వచ్చిన ‘సెగ’ ఫ్లాప్ అవగా.. ఆ వెంటనే ‘పిల్ల జమిందార్’తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. జమిందారు మనమడు జీవితం అంటే ఏంటో ఎలా తెలుసుకున్నాడు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్టయింది. ఈ సినిమా తర్వాత నాని క్రేజ్ ఎక్కడికి వెళ్లిందంటే ఏకంగా రాజమౌళితో ‘ఈగ’ చేసే వరకు వెళ్లింది. సినిమాలో కనిపించింది కాసేపే అయినా.. సినిమా అంతటా నాని బిందుపై చూపించే ప్రేమ క్యారీ అవుతుంది. ఇక్కడే హీరోగా నాని పది మెట్లు ఎక్కేశాడు. తొలిసగంలో నాని కనిపించిన పాతిక నిమిషాలు మనల్ని తన ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. సెకండ్ హాఫ్‌లో ఈగగా మారినా.. అప్పటికే నానికి కనెక్ట్ అవడంతో ఈగలో కూడా నాని ప్రజెన్స్నే ఫీలవుతుంటాం.
![Nanai3]](https://d2e1hu1ktur9ur.cloudfront.net/wp-content/uploads/2023/09/NANAI3.gif)
ఇక అదే ఏడాది గౌతమ్ మీనన్‌తో సమంతతో కలసి ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ అనే న్యే ఏజ్ రోమ్ కామ్ చేశాడు. కమర్షియల్‌గా పెద్దగా వర్కవుట్ కాలేదు కానీ సినిమాకు గొప్ప ప్రశంసలు దక్కాయి. అప్పుడే నిర్మాతగా మారి ‘డీ ఫర్ దోపిడి’ సినిమా చేశాడు. ‘ది ఫ్యామిలీ మేన్’, ‘ఫర్జీ’ రూపకర్తలు రాజ్ అండ్ డీకేలతో కలిసి ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయమే సాధించింది. ఎటో వెళ్లిపోయింది తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని కృష్ణవంశీ దర్శకత్వంలో ‘పైసా’ సినిమా చేశాడు. ఇది అల్ట్రా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత వరుసగా మూడు ఫ్లాపులు పడ్డాయి.

అదే టైమ్‌లో నాగ్ అశ్విన్ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా కథను నానికి చెప్పాడు. వైజయంతీ బ్యానర్ అనడంతో మరో మారు ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమా నానికి మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్’ మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత మళ్లీ నాని వెనక్కి చూసుకునే రోజు రాలేదు. బ్యాక్ టు బ్యాక్ 8 హిట్లు కొట్టి.. ఇప్పుడున్న జనరేషన్లో ఏ హీరో సాధించలేని రేర్ ఫీట్‌ను సాధించాడు. ఇక 2018లో రిలీజైన ‘కృష్ణార్జున యుద్దం’ వరకు నానికి ఫ్లాప్ సినిమానే లేదు. ఆ తర్వాత నాగార్జునతో కలిసి చేసిన ‘దేవ దాస్’ సినిమా కూడా పెద్దగా హిట్టవ్వలేదు.

ఆ తర్వత ఏడాది ‘జెర్సీ’తో నాని నటుడిగా ఓ సంచలనం సృష్టించాడు. ఈ సినిమాలో నాని నటన చూసి ఎందరో మహామహులు ప్రశంసలు వర్షం కురిపించారు. బాలీవుడ్లో జెర్సీ రీమేక్ చేసిన షాహిద్ కపూర్ సైతం నాని నటనకు పరసించి పోయానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత పెన్సిల్ పార్థసారధిగా ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చేసి హిట్టు కొట్టాడు. ఇక తన 25వ సినిమా మైల్‌స్టోన్‌గా మిగలాలని ‘వి’ సినిమాలో తొలిసారి ప్రతినాయకుడి పాత్ర చేశాడు. నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయితే నాని నటనకు మాత్రం అప్లాజ్మెంట్స్ వచ్చాయి.

శివ నిర్వాణతో చేసిన ‘టక్ జగదీష్’ అంతగా ఆకట్టుకోలేదు. అదే ఏడాది రిలీజైన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా నానికి సౌత్‌లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక విభిన్న కథాంశంతో వచ్చిన ‘అంటే సుందరానికి’ తొలిరోజే బెడిసి కొట్టింది. ఎన్ని సినిమాలు చేసినా నానికి కమర్శియల్ హీరోగా పేరు రావడం లేదు. అదే టైమ్‌లో ‘దసరా’ సినిమాతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర భీభత్సం సృష్టించాడు. బాక్సాఫీస్ దగ్గర వంద కోట్లు కొల్లగొట్టి విజయం ఢంకా మోగించాడు. ఈ సినిమాతో నాని మాస్ ఆడియెన్స్ నుంచి ఫుల్ యాక్సప్టెన్స్ వచ్చేసింది. ప్రస్తుతం నాని ‘హాయ్ నాన్న’ అనే సినిమా చేస్తున్నాడు. మృణాళ్ థాకూర్ హీరోయిన్గా నటిస్తున్న సినిమాను శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.

ఇక నాని నిర్మాతగానూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. ‘అ!’, ‘హిట్’ సిరీస్, ‘మీట్ క్యూట్’ ఇలా కొత్త తరహా కథలను, టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నాడు.
 
                            