Nani | నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. సక్సెస్ఫుల్ ‘హిట్’ సినిమా ఫ్రాంఛైజీలో వస్తున్న మూడో చిత్రమిది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. శ్రీనిధిశెట్టి కథానాయిక. షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ నెల 24న నాని పుట్టిన రోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నాని కనిపించనున్నారు. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జే మేయర్, రచన-దర్శకత్వం: శైలేష్ కొలను.