Nani HIT 3 | టాలీవుడ్ నటుడు నాని, నటి శ్రీనిధి శెట్టి ఆదివారం ఉదయం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అలిపిరి నుంచి మెట్లమార్గంలో ఉదయం తిరుమల చేరుకున్న నటులుకి తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు నాని, శ్రీనిధిని ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
నాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం హిట్ 3. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ హిట్ నుంచి వస్తున్న 3వ చిత్రమిది. ఈ చిత్రంలో నాని కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. శైలేశ్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా.. మే 01న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌లో షురూ చేశారు. ఇందులో భాగంగానే నేడు తిరుమలకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నారు నటులు.