నెట్ ఫ్లిక్స్‌లో దూసుకెళ్తున్న నాని శ్యామ్ సింగరాయ్.. ఇండియాలోనే నంబర్‌వన్

Shyam singha roy in OTT | ఒకవైపు బాలయ్య హాట్ స్టార్‌లో అరాచకం చేస్తుంటే.. మరోవైపు నాని నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టిస్తున్నాడు. ఈయన తాజా సినిమా శ్యామ్ సింగరాయ్ జనవరి 21న విడుదలైంది. భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. రూ.28 కోట్లు వసూలు చేసి అద్భుతమైన లాభాలు తీసుకొచ్చింది శ్యామ్ సింగరాయ్. టాక్సీవాలా తర్వాత రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన ఈ సినిమాలో నాని, సాయి పల్లవి జంటగా నటించారు. కృతి శెట్టి మరో హీరోయిన్గా నటించింది.
ఈ సినిమాకు కేవలం ప్రేక్షకుల నుంచి మాత్రమే కాదు సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఈ మధ్యే సినిమా చూసిన చిరంజీవి నానిని ప్రత్యేకంగా ఇంటికి పిలిచి అభినందించారు. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు సత్యదేవ్ జంగా కథ అందించారు. రేటింగ్స్ పరంగా కూడా ఈ సినిమాకు అద్భుతమైన అప్లాజ్ రావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఈ సినిమా కోసం వేచి చూశారు. నాని సినిమా కోసం నెట్ ఫ్లిక్స్ భారీ రేటు పెట్టింది. దాదాపు రూ.11 కోట్లకు ఈ సినిమా డిజిటల్ హక్కులు వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే విడుదలైన 28 రోజులకు సినిమాను ఓటీటీలో విడుదల చేశారు.
Two of many reasons why you should watch Shyam Singha Roy tonight👇 pic.twitter.com/lXu3PPaen0
— Netflix India South (@Netflix_INSouth) January 22, 2022
ఓటీటీలో కూడా సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండటంతో దర్శక నిర్మాతలు పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే సినిమా విడుదలైన తర్వాత ఇండియా మొత్తంలో నెంబర్ వన్ ట్రెండింగ్ అవుతుంది నాని సినిమా. ఇదే విషయాన్ని అధికారికంగా నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. దాంతో నాని ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అవుతున్నారు. కచ్చితంగా రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని అద్భుతాలు క్రియేట్ చేస్తుందని బలంగా నమ్ముతుంది నెట్‌ఫ్లిక్స్. ఈ సినిమాలో దేవదాసీ వ్యవస్థను ప్రశ్నించారు. బెంగాల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవర్ ఫుల్ రైటర్ పాత్రలో నాని నటించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
డిస్నీ హాట్‌స్టార్‌లో బాలకృష్ణ అఖండ సరికొత్త రికార్డులు.. 24 గంటల్లో 10 లక్షలకుపైగా వ్యూస్
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీజర్ రిలీజ్.. మళ్లీ అదే కాన్సెప్ట్‌తో..
మహేశ్ బాబు చెల్లిగా సాయి పల్లవి.. కాంబినేషన్ అదుర్స్ కదూ..
Sai Pallavi | చూపులతో చంపేస్తున్న సాయిపల్లవి..
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

