‘ ఈ సినిమాకు ఒక టార్గెట్ ఆడియన్స్ మాత్రమే ఉంటారని అనుకున్నాం. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లలో క్యూ కట్టడం ఆశ్చర్యంగా అనిపిస్తున్నది. నాని పోషించిన అర్జున్ సర్కార్ పాత్రను వైలెంట్‌గా డిజైన్ చేశాం. ఆ పాత్ర లేడీస్‌కి నచ్చడం సర్ప్రైజింగ్గా ఉంది.’ అంటున్నారు దర్శకుడు శైలేష్ కొలను. నాని హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హిట్: The 3rd case’. శ్రీనిధి శెట్టి కథానాయిక. ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. మే 1న పానిండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్నదని దర్శకుడు శైలేష్ కొలను చెబుతున్నారు.
శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించిన ఆయన, సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘ఈ సినిమాలో డార్క్ వెబ్ గురించి చర్చించాం. ప్రస్తుతం దేశంలో అది పెద్ద సమస్య. డార్క్ వెబ్ ద్వారా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సైబర్ డిపార్ట్ట్మెంట్ దీనిపై వర్క్ చేస్తున్నది. తెలంగాణ, ఏపీ పోలీసులకు ఈ సినిమా కథాంశం వివరించాం. స్క్రిప్ట్ విషయంలో వారెంతో హెల్ప్ చేశారు. డార్క్ వెబ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.’ అని శైలేష్ కొలను చెప్పారు.
నటుడిగా నానీలోని కొత్త కోణాన్ని ‘హిట్ 3’ ఆవిష్కరించిందని, ఎలాంటి పాత్రనైనా సమర్ధవంతంగా హ్యాండిల్ చేయగల మంచి నటుడు నాని అని, మృదులగా శ్రీనిధి శెట్టి అద్భుతంగా పెర్ఫాం చేసిందని, సముద్రఖని, రావురమేష్ తమ పాత్రలకు న్యాయం చేశారని, ‘హిట్’ ఫ్రాంచైజీలో వచ్చే చివరి సినిమాలో హీరోలందర్నీ ఒకే స్క్రీన్‌పై చూపించాలనుకుంటున్నానని, అందుకే.. ఈ సినిమా ైక్లెమాక్స్‌లో వచ్చే క్యామియోస్లో విశ్వక్సేన్ని హైడ్ చేశానని శైలేష్ కొలను చెప్పారు. మిక్కీ జె.మేయర్ సంగీతం, సాను జాన్ వర్గీస్ కెమెరా సినిమాకు ప్రధానమైన పిల్లర్సని శైలేష్ అభిప్రాయపడ్డారు. వెంకటేష్‌తో సినిమా కచ్ఛితంగా ఉంటుందని, ‘హిట్ 4’లో కార్తీ పాత్రను కొంచెం రూటెడ్‌గా, ఫన్‌గా డిజైన్ చేయబోతున్నానని, కథకు సంబంధించిన ఓ ఐడియా ఉందని, పూర్తి కథ ఇంకా తయారవ్వలేదని శైలేష్ తెలిపారు.