Nani 33 | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) కాంపౌండ్ నుంచి వచ్చిన మాస్ ఎంటర్టైనర్ దసరా (Dasara) బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిందని తెలిసిందే. పక్కా తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా గ్రాస్ సాధించింది. కాగా నాని – శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) బ్లాక్ బస్టర్ కాంబో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతుందని వార్తలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ నాని 33 (Nani 33)కి సంబంధించిన ప్రకటన చేసి అందరిలో జోష్ నింపింది నాని టీం.
నాని అండ్ శ్రీకాంత్ ఓదెల టీం ఈ సారి కూడా యాక్షన్ డ్రామా ప్లాన్ చేస్తున్నారంటూ వార్త తెరపైకి వచ్చింది. అయితే ప్రకటన రాగానే ఈ సినిమా దసరా సీక్వెల్ అని, ఫస్ట్ పార్టు స్టోరీకి కొనసాగింపు ఉంటుంది.. అంటూ పుకార్లు ఊపందుకున్నాయి. ఫిలింనగర్ సర్కిల్ తాజా సమాచారం ప్రకారం నాని 33 సీక్వెల్ కాదట.. ఒరిజినల్ ఫిల్మ్ అని టాక్. శ్రీకాంత్ ఓదెల కొత్త సబ్జెక్టును రెడీ చేశాడట. ఈ సినిమా కొంత పొలిటికల్ టచ్ ఇస్తూ సాగనుందని తెలుస్తోండగా.. రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
నాని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలొ వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో చేస్తున్న నాని 31 ఒకటి. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రానికి సరిపోదా శనివారం టైటిల్ ఫైనల్ చేయగా.. షూటింగ్ దశలో ఉంది. నాని మరోవైపు బలగం డైరెక్టర్ వేణు యెల్దండి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఎల్లమ్మ టైటిల్ ఫైనల్ చేశారు. మరి నాని 33 వచ్చేది ఈ రెండు సినిమాల తర్వాతేనా..? కాదా..? అనే దానిపై రానున్న రోజుల్లో ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Nani33