ఇటీవలే టక్ జగదీష్ (Tuck Jagadish) సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు న్యాచురల్ స్టార్ నాని (Nani) . మరోవైపు రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో శ్యామ్‌సింగరాయ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి ఉండగానే కొత్త చిత్రాన్ని ప్రకటించేందుకు రెడీ అయ్యాడు. దసరా సందర్భంగా నాని తన 29వ (Nani 29th film) చిత్రాన్ని ప్రకటించబోతున్నాడు. అక్టోబర్ 15న మధ్యాహ్నం 1.53 గంటలకు సినిమా ప్రకటనతోపాటు నటీనటులు, ఇతర వివరాలపై స్పష్టత రానుంది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపాడు నాని.
విరాటపర్వం చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. టక్ జగదీష్ ప్రమోషన్స్ సమయంలో నాని ఈ సినిమా గురించి, ఫస్ట్ లుక్ పోస్టర్ గురించి భారీ హైప్ క్రియేట్ చేశాడు. అంతేకాదు ఎక్స్ ట్రాక్షన్ బిగిన్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చి క్యూరియాసిటీ లెవల్స్ పెంచేశాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన టక్ జగదీష్ నానికి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
ప్రస్తుతం చేస్తున్న శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి చిత్రాలపై దృష్టి పెట్టాడు నాని. వీటితోపాటు 29వ సినిమాను కూడా ప్రకటించబోతూ అభిమానుల్లో జోష్ నింపేందుకు రెడీ అవుతున్నాడు.
ఇది కూడా చూడండి
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్
Jacqueline Fernandez | ‘నీలిరంగు చీరలోనా..సందమామా నీవే జాణ’
Sunny Leone | స్వర్గంలో ఏంజెల్లా సన్నీలియోన్