Nandamuri Balakrishna | ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ అరుదైన ఘనతను సాధించారు. భారతీయ సినిమా చరిత్రలో హీరోగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నందమూరి బాలకృష్ణను UK లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ గుర్తింపుతో సత్కరించింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇలాంటి గౌరవం పొందిన మొట్టమొదటి నటుడిగా బాలకృష్ణ రికార్డులకెక్కాడు. ఇక ఈ అసాధారణమైన విజయాన్ని పురస్కరించుకుని ఆగస్టు 30న హైదరాబాద్లో ఒక భారీ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఐదు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో బాలకృష్ణ సాధించిన విజయాలను ఈ సందర్భంగా వేడుకగా జరుపుకోనున్నారు. బాలకృష్ణ అభిమానులు, చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఈ అరుదైన ఘనతపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
A phenomenonal achievement by the God of Masses #NBK ❤️🔥
Natasimham Shri. #NandamuriBalakrishna has been honoured with the Gold Edition Recognition by the World Book of Records, UK, for completing 50 glorious years as a hero in Indian cinema ✨
First Actor in Indian Cinema to be… pic.twitter.com/qXuzfMipUv
— BA Raju’s Team (@baraju_SuperHit) August 24, 2025