Nandamuri Taraka Ramarao – YVS Chowdary | నందమూరి హరికృష్ణ మనవడు, జానకీరామ్ కుమారుడు నందమూరి తారక రామారావు హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. నందమూరి వంశం నాలుగో తరం వారసుడిగా తారక్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, గారపాటి లోకేశ్వరి తదితరులు హాజరయ్యారు. నారా భువనేశ్వరి హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టి వారిని అభినందించారు.
అయితే ఈ మూవీ ప్రారంభమైన సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా తారక రామారావుకు శుభాకాంక్షలు తెలిపారు. “తారక రామారావు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్టీఆర్ గొప్ప విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను” అని సీఎం చంద్రబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
మూవీ ప్రారంభోత్సవం అనంతరం హీరో తారక రామారావు మాట్లాడుతూ, “మా ముత్తాత ఎన్టీఆర్, మా తాత హరికృష్ణ, మా నాన్న జానకీరామ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయని నమ్ముతున్నాను. ఈ రోజు నా కుటుంబ సభ్యులందరూ నన్ను ప్రోత్సహించడానికి ఇక్కడికి రావడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ప్రేక్షకుల ప్రేమాభిమానాలే నన్ను ముందుకు నడిపిస్తాయని నమ్ముతున్నాను. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచి మీడియా ఎంతో సహకరించింది. వారందరికీ కృతజ్ఞతలు” అని అన్నారు.
Warm wishes to Nandamuri Taraka Ramarao, son of late Shri Janakiram Garu, as he marks his entry into cinema. Wishing him great success as the first look of his debut film is unveiled today. pic.twitter.com/IBSToAP9BR
— N Chandrababu Naidu (@ncbn) May 12, 2025