Nandamuri Taraka Ramarao | సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య లాంటి సినిమాలతో డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వైవీఎస్ చౌదరి (YVS Chowdary). ఇప్పటికే పలువురు హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈ క్రేజీ డైరెక్టర్ ఇప్పుడు నందమూరి తారకరామారావు కుటుంబం నుంచి కొత్త నటుడిని అందరికీ పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాతో వైవీఎస్ చౌదరి సతీమణి యలమంచిలి గీత నిర్మాతగా మారుతుండటం విశేషం.
ఎన్టీఆర్ నాలుగో తరం వారసుడు నందమూరి హరికృష్ణ మనవడు (జానకిరామ్ కుమారుడు) నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Ramarao)ను ఈ సినిమాతో నందమూరి ఫ్యామిలీ నుంచి లీడ్ యాక్టర్‌గా తనను తాను నిరూపించుకునేందుకు వస్తున్న కొత్త నటుడి కోసం కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సాగే కథను రెడీ చేశాడట వైవీఎస్ చౌదరి. నటుడిగా అందరినీ ఇంప్రెస్ చేసేందుకు నందమూరి తారకరామారావు యాక్టింగ్, ఫైట్స్‌లో శిక్షణ తీసుకోవడంతోపాటు మేకోవర్ కూడా మార్చుకున్నాడని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. New Talent Roars బ్యానర్లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత రానుంది.
వైవీఎస్ చౌదరి చివరగా సాయిదుర్గతేజ్‌తో రేయ్ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అప్పటి నుంచి ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి సినిమా రాక పదేళ్లు అవుతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత కొత్త యాక్టర్‌తో సినిమా చేస్తుండటంతో అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోతుంది.
New day, new beginnings, and a new journey ahead ✨
Tune in live to watch the dynamic director @helloyvs‘s sensational announcement live:
▶️ https://t.co/xkIUodjwGf@NewTalentRoars #YVSChowdary @MediaYouwe @UrsVamsiShekar pic.twitter.com/KGg0rTeUkw— YouWe Media (@MediaYouwe) June 10, 2024