నందమూరి చైతన్యకృష్ణ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బ్రీత్’. ‘వైద్యో నారాయణో హరి’ ఉపశీర్షిక. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకుడు. సోమవారం చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. హాస్పిటల్ నేపథ్యంలో జరిగే సంఘటనల నేపథ్యంలో టీజర్ ఆద్యంతం ఆసక్తిని పంచింది. ‘ఇప్పటివరకు చూడని ఓ కొత్త క్రైమ్ జరుగుతుంది’ అనే డైలాగ్ కథలోని ఉత్కంఠకు అద్దం పట్టింది.
‘ఎమోషనల్ థ్రిల్లర్ కథాంశమిది. హీరో చైతన్యకృష్ణ పాత్ర భిన్న కోణాల్లో సాగుతుంది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. వైదిక సెంజలియా, వెన్నెల కిషోర్, కేశవ్ దీపక్, భద్రమ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాకేష్ హోసమణి, సంగీతం: మార్క్ కె రాబిన్, నిర్మాత: నందమూరి జయకృష్ణ, రచన-దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల.