బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రానికి ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ‘ఐ డోంట్ కేర్’ ఉపశీర్షిక. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతున్నది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం టైటిల్ను ప్రకటించడంతో పాటు కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ చేతిలో ఖడ్గంతో పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. ‘ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని రీతిలో బాలకృష్ణ పాత్ర సాగుతుంది. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.