Mokshagna Teja Movie | టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడా అని అటు నందమూరి ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ మొదటి సినిమాకు దర్శకత్వం వహించేది హన్మాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ అని ఇప్పటికే ప్రకటించారు. ఇక ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రాబోతుండగా.. తాజాగా ఈ ప్రాజెక్ట్ షూటింగ్‌కు సంబంధించి సాలిడ్ అప్డేట్ను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రల్లో మెరవనున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఉన్న రిలేషన్‌తో పాటు కొడుకు ఫస్ట్ సినిమా కావడంతో ఈ చిత్రంలో బాలయ్య ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య శ్రీకృష్ణుడిగా కనిపించనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ సినిమాను డిసెంబర్ 02న అధికారికంగా లాంఛ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే రెగ్యూలర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ సినిమాతో బాలీవుడ్ భామ రవీనా టాండన్ కూతురు రషా తథానీ హీరోయిన్గా పరిచయం కాబోతుందనే టాక్ ఫిలిం నగర్లో వినిపిస్తుంది. ఈ చిత్రంలో రానా విలన్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కుమార్తె ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.