Balayya | బాలయ్య మృతి పట్ల.. బాలకృష్ణ ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత మన్నవ బాలయ్య శనివారం కన్నుమూశారు. ఈయన మృతి పట్ల సినీప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ఈయన మరణ వార్త విన్న బాలకృష్ణ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశాడు.
Balayya | ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత మన్నవ బాలయ్య శనివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలయ్య యూసుఫ్ గూడలోని తన స్వగృహంలో శనివారం తెల్లవారుజామున కన్నుమూసాడు. 1958లో వచ్చిన ‘ఎత్తుకు పై ఎత్తు’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన బాలయ్య ఇప్పటివరకు దాదాపు 300 సినిమాల్లో నటించాడు. ఈయన మృతి పట్ల సినీప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ఈయన మరణ వార్త విన్న బాలకృష్ణ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశాడు.
‘సీనియర్ నటుడు మన్నవ బాలయ్య గారి మరణవార్త నన్నెంతగానో కలచివేసింది. బాలయ్య గారు అద్భుతమైన నటులు, నాన్న గారితో కలిసి నటించారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా బాలయ్య తన ప్రతిభను చూపారు. ఆయనతో మా కుటుంబానికి మంచి అనుబంధం వుంది. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. బాలకృష్ణ నటించిన ‘పాండురంగడు’, ‘మిత్రుడు’, ‘శ్రీరామరాజ్యం’ సినిమాలలో బాలయ్య నటించాడు.
Actor, MLA #NandamuriBalakrishna expressed his deepest condolences on the sudden demise of Veteran actor Shri #Balayya garu. pic.twitter.com/k8mJnRkAgy
— Vamsi Kaka (@vamsikaka) April 9, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

