Akhanda 2 | టాలీవుడ్ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కలిసి మంగళవారం ఉదయం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. వీరితో పాటు చిత్ర నిర్మాత గోపీ అచంట కూడా ఉండడం విశేషం. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం అఖండ 2, అఖండ చిత్రానికి సీక్వెల్గా ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ఈ విజయవంతం కావాలని చిత్రబృందం సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకుంది. అంతకుముందు బాలయ్య కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రాలతో ఆయనను ఆశీర్వదించి స్వామి వారి ప్రసాదం అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలను చిత్రబృందం ఎక్స్ వేదికగా విడుదల చేసింది.
Team #Akhanda2 took divine blessings at Shri Varaha Lakshmi Narasimha Swamy Temple, Simhachalam ahead of the second single launch in Visakhapatnam ✨#JajikayaJajikaya grand launch event at the iconic Jagadamba Theatre, Vizag today from 5 PM onwards 💥💥#Akhanda2 IN CINEMAS… pic.twitter.com/78YJv6lwIq
— BA Raju’s Team (@baraju_SuperHit) November 18, 2025