ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పురస్కారాల ప్రదానోత్సవం ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో సోమవారం ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని అందుకున్నారు.
తెలుగుదనం ఉట్టిపడేలా పంచకట్టులో ఆయన ఈ వేడుకకు హాజరవ్వడం విశేషం. అలాగే, తమిళ అగ్ర నటుడు అజిత్ కూడా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.