విశ్వంత్, అనురూప్, విస్మయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నమో’. ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఏ.ప్రశాంత్ నిర్మాత. శనివారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సీనియర్ దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు ఆవిష్కరించారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. వినోద ప్రధానంగా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. కథానుగుణంగా సంగీతానికి ప్రాధాన్యత ఉంటుంది’ అన్నారు. నేటి యువతరం ఆలోచనలను ప్రతిబింబించే చిత్రమిదని హీరో విశ్వంత్ పేర్కొన్నాడు. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుందని హీరోయిన్ విస్మయ తెలిపింది.