Thrinadha Rao Nakkina | విక్రమ్ సహిదేవ్, ఎస్తేర్ అనిల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నక్కిన నేరెటివ్స్ పతాకంపై నక్కిన త్రినాథరావు నిర్మిస్తున్నారు. వంశీకృష్ణ మళ్ల దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి సందీప్‌కిషన్ క్లాప్‌నివ్వగా, శరత్ మరార్ కెమెరా స్విఛాన్ చేశారు. సుమంత్ గౌరవ దర్శకత్వం వహించారు.
నిర్మాత నక్కిన త్రినాథ రావు మాట్లాడుతూ ‘స్నేహితుల సహకారంతో ఈ బ్యానర్ స్థాపించాను. నిర్మాతగా రెండో చిత్రమిది. ఇదొక కల్ట్ లవ్‌స్టోరీ. పట్టణం నేపథ్యంలో జరిగే అందమైన ప్రేమకథగా మెప్పిస్తుంది. ప్రతీ పాత్రకు కథాగమనంలో ప్రాముఖ్యత ఉంటుంది’ అన్నారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు వంశీకృష్ణ మళ్ల తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మాయ వి, సంగీతం: దావ్జాంద్, ప్రొడక్షన్ డిజైనర్: రఘు కులకర్ణి, సంభాషణలు: నరేష్ తుల, రాజేంద్రప్రసాద్, కథ, నిర్మాత: త్రినాథరావు నక్కిన, దర్శకత్వం: వంశీకృష్ణ మళ్ల.