Nagendran’s Honeymoons | మలయాళ నటుడు నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ (Suraj Venjaramoodu) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘డ్రైవింగ్ లైసెన్స్’, ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’, ‘జనగణమన’ చిత్రాలతో నటుడిగా మంచి విజయాలు అందుకున్నాడు. అయితే ఇప్పుడు సూరజ్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సూరజ్ వెంజరమూడ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళీ వెబ్ సిరీస్ ‘నాగేంద్రన్స్ హానీమూన్స్'(Nagendran’s Honeymoons). ఒక జీవితం ఐదుగురు భార్యలు అనేది ఉపశీర్షిక. నితిన్ రెంజీ పనికర్ (Nithin Renji Panicker) ఈ సినిమాను నిర్మించడంతో పాటు రచన దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. రీసెంట్గా ఈ మూవీ నుంచి టీజర్ విడుదల చేయగా.. ఐదుగురు భార్యలు ఉన్న నాగేంద్రన్ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోన్నాడు అనేది ఈ సినిమా స్టోరీ అని తెలుస్తుంది. ఇదిలావుంటే.. తాజాగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ వెల్లడించారు.
ఈ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూలై 19 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, ఇతర భాషలలో ఈ సిరీస్ విడుదల కాబోతుంది. రమేష్ పిషారోడి, శ్వేతా మీనన్, కని కృతి, గ్రేస్ ఆంటోని, అమ్ము అభిరామి, నిరంజన అనూప్, ఆల్ఫీ పంజికరణ్, కళాభవన్ షాజోన్, అలెగ్జాండర్ ప్రశాంత్, జనార్దనన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు రంజిన్ రాజ్ సంగీతం అందిస్తున్నాడు.