నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎస్.ఎస్. అరుణాచలం దర్శకత్వంలో వైష్ణవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్‌కుమార్, అశోక్ కుమార్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్‌నివ్వగా, అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విఛాన్ చేశారు. ‘నాగశౌర్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రమిది. యూత్, ఫ్యామిలీ మెచ్చే అన్ని అంశాలుంటాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిసామి, సంగీతం: హారిస్ జయరాజ్, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, ఆర్ట్: సాయిప్రవీణ్, అడిషినల్ స్క్రీన్‌ప్లే: ఎస్.వి.శేఖర్, రచన-దర్శకత్వం: ఎస్.ఎస్.అరుణాచలం.